Sunday, November 22, 2020

చిదంబరం యొక్క పురాణం , దాని ప్రాముఖ్యత



పురాణం

చిదంబర కథ పరమశివుడు తిల్లైవన సంచారంతో మొదలౌతుంది, (వనం అనగా అర్ధం అడవి, తిల్లై వృక్షాలు - వృక్షశాస్త్ర నామం ఎక్సోకేరియా అగాల్లోచ, ఒక ప్రత్యేకమైన నీటి చెట్టు- ఇది ప్రస్తుతం చిదంబరం దగ్గరలోని పిఛావరం నీటిచలమల్లో పెరుగుతోంది. ఆలయ చెక్కడాలు తిల్లై వృక్షాలు క్రీశ 2వ శతాబ్దంలోనివిగా వర్ణిస్తాయి).

అజ్ఞానం యొక్క దమనం

తిల్లై వనాలలో కొంతమంది మునులు లేదా 'ఋషులు' నివసించేవారు, వారు మంత్రశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను నమ్మారు, భగవంతుడిని కొన్ని క్రతువులు, 'మంత్రాల'తో నియంత్రించవచ్చని భావించారు. దేవుడు, 'పిచ్చతనాదర్' రూపంలో, ఒక సాధారణ యాచకుడివలే, ఎంతో అందమైన, ప్రకాశవంతమైన అడవిలో సంచరిస్తాడు. అతనిని మోహిని అవతారంలోనున్న అతని సహవాసియైన విష్ణువు అనుసరిస్తాడు. ఋషులు, వారి భార్యలు, ఎంతో ప్రకాశవంతమైన ఈ యాచకుడు, అందమైన ఆతని సహవాసిని చూసి ముగ్ధులౌతారు.
ఆనందభరితులైన వారి యొక్క ఆడవారిని చూసి, ఋషులు ఆగ్రహిస్తారు, మంత్రాలతో కూడిన క్రతువులను ఆచరించి అసంఖ్యాకమైన 'సర్పాల'ను (సంస్కృతం: నాగ) ఆమంత్రిస్తారు. యాచకుడైన ఆ భగవంతుడు సర్పాలను ఎత్తి వాటిని మెడకు, నడుముకి దట్టంగా చుట్టుకొని ఆభరణములవలె ధరిస్తాడు. మరింత ఆగ్రహించిన ఋషులు, ఒక భయానకమైన పులిని ఆమంత్రించగా, దాన్ని కూడా శివుడు చీల్చి, ఆ పులి చర్మాన్ని నడుము చుట్టూ శాలువా వలె ధరిస్తాడు.
పూర్తిగా విసుగు చెందిన ఋషులు, వారి యొక్క ఆధ్యాత్మిక శక్తిని మొత్తం కూడదీసుకొని, ఒక శక్తివంతమైన రాక్షసుడు ముయాలకన్ - అను, అజ్ఞానానికి, గర్వానికి చిహ్నమైన ఒక శక్తివంతమైన రాక్షసుడిని ఆమంత్రిస్తారు. పరమ శివుడు ఒక చిరునవ్వుతో, రాక్షసుడి యొక్క వెన్ను మీద కాలు మోపి, కదలకుండా చేసి ఆనంద తాండవం (ఆద్యంతరహితమైన చిద్విలాస నృత్యం) చేస్తాడు, ఆతని నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. భగవంతుడు వాస్తవమని, అతను మంత్రాలకు, ఆగమ సంబంధమైన క్రతువులకు అతీతుడని గ్రహించి, ఋషులు లొంగిపోతారు.

ఆనంద తాండవ భంగిమ

పరమ శివుని యొక్క ఆనంద తాండవ భంగిమ, యావత్ ప్రపంచంలో ప్రసిద్ధమైన భంగిమలలో ఒకటిగా, అనేకులు (ఇతర మతస్థులు కూడా హిందూ మతానికి చెందిన దీన్ని కొనియాడి) గుర్తించారు. ఈ దివ్య నృత్య భంగిమ భరతనాట్య నర్తకుడు ఎలా నర్తించాలో తెలియజేస్తుంది.

  • అతని పాదం క్రింద ఉన్నది అజ్ఞానం అను భావాన్ని నటరాజుని పాదం క్రింద ఉంచిన రాక్షసుడుతో సూచిస్తుంది.
  • చేతిలోని నిప్పు (నాశనం చేయు శక్తి) అనగా దుష్టశక్తులను నాశనం చేయునది.
  • ఎత్తిన చేయి అతను సర్వ జగత్తుకి రక్షకుడని తెలియజేస్తుంది.
  • వెనుక ఉన్న వలయం విశ్వాన్ని సూచిస్తుంది.
  • చేతిలోని ఢమరుకం జీవం యొక్క పుట్టుకను సూచిస్తుంది.

ఇట్టి ప్రధాన సంగతులను నటరాజ మూర్తి, దివ్యమైన నృత్య భంగిమ వర్ణిస్తాయి. ఇక్కడి నుంచి 32కిమీ దూరంలోని మేలకదంబూర్ ఆలయంలో తాండవ భంగిమ యొక్క అరుదైన రకం అగుపడుతుంది. ఈ కోవెలలో, నటరాజు దున్నపోతు మీద నర్తిస్తున్నట్టు, గుండ్రంగా తిరుగుచూ చేయు నృత్యభాగం ఈ పుణ్య స్థానంలో ఉంచబడిన ఒక పాలా కళగా గుర్తించడమైనది.

ఆనంద తాండవం

ఆదిశేషువు అనే సర్పం, తల్పం వలె మారి విష్ణువుగా సాక్షాత్కరించిన భగవంతుని సేవిస్తుండగా, ఆనంద తాండవం గురించి విని దానిని చూసి తరించవలెనని ఉత్సాహపడతాడు. అంతట భగవంతుడు ఆదిశేషువుని దీవించి, అతనికి యోగ స్వరూపుడైన 'పతంజలి' రూపాన్ని ప్రసాదించి తిల్లై అడవులకి వెడలి పొమ్మని, అతను అచిరకాలంలోనే నృత్యంలో విన్యాసాలు చేయగలడని చెబుతాడు.

కృత యుగంలో పతంజలి హిమాలయాల్లో తపస్సు చేసి మరొక ముని వ్యాఘ్రపథార్ / పులికాల్ముని ని కలుస్తాడు (వ్యాఘ్ర / పులి అనగా అర్ధం "పులి", పథ / కాల్ అనగా అర్ధం "పాదం" – అతను దేవుని పూజకు తెచ్చు పూల మీద తుమ్మెదలు వ్రాలుటకు ముందే అనగా వేకువ జాములో చెట్లను ఎక్కి కోయుటకు వీలుగా అతనికి అట్టి పాదాలు, పులి యొక్క కంటిచూపు మాదిరి చూపు వచ్చెనని తెలియజేయు కథ ద్వారా ఆ పేరు అతనికి వచ్చినది). పతంజలి యోగి, అతని యొక్క ఉత్తమ శిష్యుడైన ఉపమన్యు యోగి యొక్క కథలు విష్ణు పురాణం అదే విధంగా శివ పురాణంలో కూడా వర్ణించబడ్డాయి. వారు తిల్లై వనంలోకి వెళ్లి ప్రార్థించిన శివలింగ రూపంలోని పరమశివుడు, ప్రస్తుతం పూజిస్తున్న తిరుమూలాటనేస్వరర్ లోని దేవుడు ఒక్కడే (తిరు - శ్రీ, మూలటనం - స్వయంభువుడైన, ఈశ్వరర్ - ఈశ్వరుడు). పరమ శివుడు, నటరాజుగా అతని యొక్క చిద్విలాస నృత్యాన్ని (ఆనంద తాండవం) ఈ ఇద్దరు మునులకు పూసం నక్షత్రం ఉన్న రోజున, తమిళ మాసం తాయ్ (జనవరి – ఫెబ్రవరి) లో ప్రదర్శించాడని పురాణాలు చెబుతాయి.

ప్రాముఖ్యత

చిదంబరాన్ని వివిధ రచనలలో, తిల్లై (గతంలో తిల్లైవనంలో ఇప్పుడున్న దేవాలయం నెలకొన్నది), పెరుంపత్రపులియుర్ లేదా వ్యాఘ్రపురం (వ్యాఘ్రపథార్ ముని జ్ఞాపకార్ధం) అని కూడా సూచించడమైనది.
ఆలయం, విశ్వం యొక్క హృదయ కమలంలో నెలకొల్పారని భావించడమైనది": విరాట్ హృదయ పద్మ స్థలం . దైవం యొక్క చిద్విలాస నృత్యం, ఆనంద తాండవం ప్రదర్శించిన స్థలం - "తిరుమూలాటనేస్వర్ ఆలయా"నికి సరిగ్గా దక్షిణంలో ఉన్నది, ప్రస్తుతం ఆ స్థలం పొన్నాంబలం / పోర్సాబై (పొన్ అనగా అర్ధం బంగారం, అంబళం /సబై అనగా అర్ధం వేదిక)లో పరమశివుడు నర్తిస్తున్న రూపం ఉన్నది. అందువలన భగవంతుడిని సభనాయకార్ అనగా వేదిక పై వెలసిన దైవం అని కూడా అంటారు.
చిదంబర ఆలయం యొక్క బంగారపు పై కప్పు కలిగిన గర్భ గుడిలో దైవం మూడు రూపాలలో సాక్షాత్కరిస్తాడు:
  • "స్వరూపం" - సకల తిరుమేని అని పిలిచేటి ఈశ్వరుని మనిషిగా ఆపాదించిన రూపమైన నటరాజస్వామి.
  • "అర్ధ-స్వరూపం" - చంద్రమౌళేశ్వరుని యొక్క స్పటిక లింగరూపంలోని, అర్ధ- ఈశ్వర మానుష్య శరీరమైన, సకల నిష్కళ తిరుమేని .
  • "నిరాకార స్వరూపం" - చిదంబర రహస్యం లోని అంతరాళం మాదిరి, గర్భగుడిలోని శూన్య స్థలం, నిష్కళ తిరుమేని .

పంచ భూతాల స్థలాలు

పంచభూతాల యొక్క స్థలాలలో ఒకటైన చిదంబరంలో, ఆకాశం లేదా ఆగయంగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు ("పంచ" అనగా అర్ధం ఐదు, భూత అనగా అర్ధం మూలకం: భూమి, నీరు, నిప్పు, గాలి,, అంతరాళం, "స్థల" అనగా ప్రదేశం).

మిగతావి ఏవనగా:

  • కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం, ఇక్కడ భూమిగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు.
  • తిరుచిరాపల్లి, తిరువనైకావల్ లోని జంబుకేశ్వర ఆలయంలో, నీరుగా సాక్షాత్కరించిన స్వామిని ఆరాధిస్తారు.
  • తిరువన్నామలైలోని అన్నమలైయర్ ఆలయంలో, అగ్నిగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు.
  • శ్రీకాళహస్తిలోని కాళహస్తి ఆలయంలో, గాలి/వాయువుగా సాక్షాత్కరించిన స్వామిని పూజిస్తారు.

చిదంబరం అనేది కూడా పరమ శివుడు నర్తించిన ఐదు ప్రదేశాలలో ఒకటి, అన్ని ప్రదేశాలలో వేదికలు/ సభైలు ఉన్నాయి. పోర్ సభై కలిగి ఉన్న చిదంబరం కాక, మిగతావి ఏవనగా, తిరువాలన్గాడులోని రతిన సభై (రతినం అనగా – రత్నం/ఎరుపు), కోర్తళ్ళంలోని చిత్ర సభై (చిత్ర – ఛాయా చిత్రం), మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలోని రజత సభై లేదా వెల్లి అంబళం (రజత / వెల్లి – వెండి), తిరునెల్వేలి నెల్లైఅప్పార్ ఆలయంలోని తామిర సభై (తామిరం – రాగి).





No comments:

Post a Comment

CURRENT POST

Loading…

TOP POPULAR POST